నందమూరి కళ్యాణ్ రామ్ నటిస్తున్న తాజా చిత్రం ‘నా నువ్వే’. ఈ చిత్ర ట్రైలర్ ని రేపు ఉదయం 10 గంటలకు రిలీజ్ చేయనున్నారు . ఈ సినిమాలో తమన్నా కథానాయకిగా నటించారు.
తమిళ దర్శకుడు జయేంద్ర దర్శకత్వం వహించిన ఈ సినిమాను మహేష్ కోనేరు, విజయ్ వట్టికూటి, కిరణ్ ముప్పవరపులు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
రొమాంటిక్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ చిత్రం ఈ నెల 25న ప్రేక్షకుల ముందుకురానుంది. ఇప్పటికే విడుదలైన టీజర్, ఆడియో పాటలు ఫ్రెష్ గా ఉండి ప్రేక్షకుల్ని ఆకట్టుకోవడంతో ఈ సినిమా ఫై మంచి అంచనాలే నెలకొన్నాయి. శరత్ సంగీతమందించిన ఈ చిత్రానికి ప్రముఖ కెమెరామెన్ పిసి.శ్రీరామ్ సినిమాటోగ్రఫీ అందించారు.


