బన్నీ నటిస్తున్న ‘నా పేరు సూర్య; చిత్రంపై అభిమానుల్లో ఏ స్థాయి అంచనాలున్నాయి ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఈ సినిమా కుడ బన్నీ తన విజయ పరంపరను కొనసాగిస్తాడని అభిమానులు నమ్మకంగా ఉన్నారు. అల్లు అర్జున్ ఆర్మీ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్న ఈ సినిమా యొక్క ప్రీ రిలీజ్ వేడుక ఈ నెల 29న జరగనుంది.
హైదరాబాద్లోని గచ్చిబౌలి క్రికెట్ స్టేడియంలో ఈ వేడుకను నిర్వహించనున్నారు. ఇక ఏప్రిల్ 22న బన్నీ పశ్చిమ గోదావరిలో మిలిటరీ మాధవరం అనే గ్రామాన్ని సందర్శించనున్నారు. ఇంటికి ఒకరు చొప్పున ఆ గ్రామంలోని అన్ని కుటుంబాలు ఆర్మీకి సేవలందిస్తుండటం ఆ గ్రామం యొక్క విశిష్టత. ఇకపోతే మే 4న ప్రేక్షకుల ముందుకురానున్న ఈ చిత్రంలో అను ఇమ్మాన్యుయేల్ కథానాయకిగా నటిస్తోంది.


