నాగార్జున ‘ఆఫీసర్’ టీజర్ ఎప్పుడంటే !

అక్కినేని నాగార్జున, రామ్ గోపాల్ వర్మల హిట్ కాంబినేషన్లో వస్తున్నా తాజా చిత్రం ‘ఆఫీసర్’. ప్రకటన రోజు నుండే బోలెడు క్రేజ్ సొంతం చేసుకున్న ఈ చిత్రంలో నాగార్జున ఒక ఇంటెన్స్ పోలీసాఫీసర్ పాత్రలో నటిస్తున్నారు. అంతేగాక ఒక అమ్మాయికి తండ్రిగా కూడ కనిపించబోతున్నారు.

ఇకపోతే ఈ రోజు వర్మ పుట్టినరోజు సందర్బంగా సినిమా టీజర్ తేదీని ప్రకటించారు. ఈ నెల 9వ తేదీన ఉదయం 10 గంటలకు టీజర్ రిలీజ్ కానుంది. వర్మ స్వయంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో మైరా సరీన్ కథానాయకిగా నటిస్తుండగా చిత్రాన్ని మే 25న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయనున్నారు.