లేటెస్ట్.. “ఓం భీం బుష్” టీజర్ కి డేట్ ఫిక్స్.!

లేటెస్ట్.. “ఓం భీం బుష్” టీజర్ కి డేట్ ఫిక్స్.!

Published on Feb 23, 2024 1:00 PM IST

యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో శ్రీవిష్ణు హీరోగా మరో యంగ్ టాలెంట్ ప్రియదర్శి మరియు రాహుల్ రామకృష్ణ లు కూడా కీలక పాత్రల్లో నటించిన తమ రెండో ఇంట్రెస్టింగ్ ఎంటర్టైనర్ చిత్రం “ఓం భీం బుష్”. యంగ్ దర్శకుడు హర్ష కొనుగంటి తెరకెక్కించిన ఈ మ్యాజికల్ కామెడీ థ్రిల్లర్ చిత్రం పై ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ని మేకర్స్ రీసెంట్ గానే అందించారు. అయితే ఇపుడు మరో అప్డేట్ కి మేకర్స్ డేట్ లాక్ చేసారు.

ఫస్ట్ లుక్ తో ఆసక్తి రేపిన మేకర్స్ ఇప్పుడు సినిమా టీజర్ ని అయితే లాక్ చేసారు. ఈ టీజర్ ని ఈ ఫిబ్రవరి 26న రిలీజ్ చేస్తున్నట్టుగా కన్ఫర్మ్ చేశారు. దీనితో ఈ సినిమాపై ఒక క్లారిటీ వస్తుంది అని చెప్పాలి. ఇక ఈ చిత్రంలో ఆయేషా ఖాన్, ప్రీతి ముకుందన్ తదితరులు నటిస్తుండగా సన్నీ ఎం ఆర్ సంగీతం అందిస్తున్నాడు అలాగే యూవీ క్రియేషన్స్ ప్రెజెంట్ చేస్తున్న ఈ చిత్రం ఈ మార్చ్ 22న రిలీజ్ కాబోతుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు