లేటెస్ట్ : జపాన్లో ప్రభాస్ “సలార్” టేకోవర్ కి డేట్ ఫిక్స్

లేటెస్ట్ : జపాన్లో ప్రభాస్ “సలార్” టేకోవర్ కి డేట్ ఫిక్స్

Published on May 2, 2024 12:01 PM IST

పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) హీరోగా శృతి హాసన్ (Sruthi Haasan) హీరోయిన్ గా దర్శకుడు ప్రశాంత్ నీల్ (Prashanth Neel) తెరకెక్కించిన రీసెంట్ భారీ హిట్ చిత్రం “సలార్ సీజ్ ఫైర్” కోసం అందరికీ తెలిసిందే. అయితే ఈ సినిమా ప్రభాస్ కెరీర్ లోనే రెండో హైయెస్ట్ గ్రాసర్ గా నిలిచి మరోసారి ప్రభాస్ సత్తా చాటింది. అయితే ప్రభాస్ కి ఒక్క మన దగ్గర మాత్రమే కాకుండా జపాన్ దేశంలో కూడా భారీ క్రేజ్ ఉన్న సంగతి తెలిసిందే.

అలా ఇప్పుడు వరకు ప్రభాస్ నటించిన పలు చిత్రాలు జపాన్ లో భారీ వసూళ్లు సాధించాయి. అయితే గత కొన్నాళ్ల కితమే సలార్ చిత్రం జపాన్ లో రిలీజ్ చేస్తున్నట్టుగా మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. అయితే ఇప్పుడు ఫైనల్ గా జపాన్ లో సలార్ రిలీజ్ కి డేట్ వచ్చేసింది.

ఈ చిత్రం జూలై 5న గ్రాండ్ గా రిలీజ్ కి వస్తున్నట్టుగా ఇప్పుడు ఖరారు అయ్యింది. మరి జపాన్ లో ప్రభాస్ సినిమాలకి సూపర్ డిమాండ్ ఉంటుంది. ఇప్పుడు సలార్ సినిమాతో మరోసారి జపాన్ ని తాను టేకోవర్ చేయడం కన్ఫర్మ్ అని చెప్పవచ్చు. ఇక ఈ భారీ చిత్రంలో పృథ్వీరాజ్ సుకుమారన్ అలాగే జగపతి బాబు తదితరులు నటించగా హోంబళే ఫిల్మ్స్ వారు నిర్మాణం వహించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు