ఆర్ఆర్ఆర్ సెకండ్ షెడ్యూల్ కు డేట్ ఫిక్స్ !

Published on Jan 13, 2019 8:08 pm IST

ఎన్టీఆర్ , రామ్ చరణ్ లతో అగ్ర దర్శకుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న భారీ మల్టీ స్టారర్ చిత్రం ఆర్ఆర్ ఆర్ ఇటీవలే మొదటి షెడ్యూల్ ను పూర్తి చేసుకుంది. ఈ షెడ్యూల్ తరువాత తన కుమారుడి వివాహం కోసం రాజమౌళి అలాగే వినయ విధేయ రామ కోసం చరణ్ షూటింగ్ కి బ్రేక్ ఇచ్చారు. ఇక తాజాగా ఈచిత్రం యొక్క రెండవ షెడ్యూల్ ను మొదలు పెట్టడానికి రెడీ అవుతున్నారు. ఈ చిత్రం యొక్క రెండవ షెడ్యూల్ ఈనెల 21న స్టార్ట్ కానుందని సమాచారం. ఈ షెడ్యూల్లో ఇద్దరు హీరోలు పాల్గొననున్నారు.

పిరియాడికల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ప్రముఖ తమిళ నటుడు సముద్రఖని అలాగే అర్జున్ రెడ్డి ఫేమ్ రాహుల్ రామకృష్ణ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. 300 కోట్ల భారీ బడ్జెట్ తో డివివి ఎంటర్టైన్మెంట్స్ పతాకం ఫై దానయ్య డివివి నిర్మిస్తున్న ఈ చిత్రానికి కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఈచిత్రం వచ్చే ఏడాది తెలుగు తో పాటు హిందీ , తమిళ , మలయాళ భాషల్లో విడుదలకానుంది.

సంబంధిత సమాచారం :

More