‘కల్ట్’ టీజర్ రిలీజ్‌కు డేట్ ఫిక్స్ చేసిన విశ్వక్.. ఊచకోత ఖాయమట..!

‘కల్ట్’ టీజర్ రిలీజ్‌కు డేట్ ఫిక్స్ చేసిన విశ్వక్.. ఊచకోత ఖాయమట..!

Published on Feb 19, 2026 1:02 PM IST

Cult 1

మాస్ కా దాస్ విశ్వక్ సేన్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న తాజా చిత్రం కల్ట్(CULT) ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి బజ్ క్రియేట్ చేసింది. ఈ చిత్రానికి సంబంధించిన టీజర్‌ను రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు. ఈ టీజర్ రిలీజ్ అప్డేట్‌ను తాజాగా ఓ పవర్‌ఫుల్ పోస్టర్‌తో అనౌన్స్ చేశారు.

ఫిబ్రవరి 21న ఈ సినిమా టీజర్‌ను గ్రాండ్‌గా లాంచ్ చేయనున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది. హైదరాబాద్‌లోని ప్రసాద్ ఐమ్యాక్స్ PCX స్క్రీన్‌లో మధ్యాహ్నం 3 గంటల నుండి ఈ టీజర్ రిలీజ్ వేడుక జరగనుంది. ఇక ఈ అనౌన్స్‌మెంట్ పోస్టర్‌లో విశ్వక్ సేన్ చేతిలో గొడ్డలి పట్టుకుని రక్తపు మడుగులో నడుస్తున్న తీరు చూస్తుంటే, సినిమా ఊర మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఉండబోతుందని అర్థమవుతోంది.

తారక్ సినిమాస్ బ్యానర్ పై సందీప్ కాకరాల నిర్మిస్తున్న ఈ చిత్రానికి రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నారు. తరుణ్ భాస్కర్ డైలాగ్స్ అందిస్తుండగా, విశ్వక్ సేన్ స్వయంగా కథ, స్క్రీన్ ప్లే మరియు దర్శకత్వ బాధ్యతలు చేపట్టాడు. మరి ఈ ‘కల్ట్’ మూవీతో బాక్సాఫీస్ వద్ద విశ్వక్ ఎలాంటి ఊచకోత సృష్టిస్తాడో చూడాలి.

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు