యువ సామ్రాట్ నాగ చైతన్య, అను ఇమ్మానుయేల్ జంటగా ప్రముఖ దర్శకుడు మారుతీ తెరకెక్కిస్తున్న చిత్రం ‘శైలజారెడ్డి అల్లుడు’. ప్రస్తుతం షూటింగ్ ను పూర్తిచేసుకున్న ఈచిత్రం ఆగష్టు 31న విడుదలకానుంది. ఇక అక్కినేని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ చిత్రం యొక్క టీజర్ రేపు సాయంత్రం 7 గంటల 10 నిమిషాలకు విడుదల కానుంది.
సీనియర్ నటి రమ్య కృష్ణ శైలజా రెడ్డి పాత్రలో నటించిన ఈ చిత్రానికి గోపిసుందర్ సంగీతం అందిస్తున్నారు. ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది. ఫుల్ ఎంటర్టైనర్ గా రానున్న ఈ చిత్రం ఫై భారీ అంచనాలు ఉన్నాయి.


