“భారతీయుడు 2” ఆడియో లాంచ్, రెండో సాంగ్ కి డేట్స్ ఫిక్స్.!

“భారతీయుడు 2” ఆడియో లాంచ్, రెండో సాంగ్ కి డేట్స్ ఫిక్స్.!

Published on May 27, 2024 12:59 PM IST

లోక నాయకుడు కమల్ హాసన్ (Kamal Haasan) హీరోగా సిద్ధార్థ్ అలాగే కాజల్ మరియు రకుల్ ప్రీత్ సింగ్ తదితరులు నటిస్తున్న లేటెస్ట్ అవైటెడ్ చిత్రం “భారతీయుడు 2” కోసం తెలిసిందే. మావెరిక్ దర్శకుడు శంకర్ తెరకెక్కించిన ఈ క్రేజీ సీక్వెల్ పై ఫస్ట్ సింగిల్ లో మంచి హైప్ సెట్ అయ్యింది. ఇక ఈ సినిమా నుంచి ఇప్పుడు మేకర్స్ రెండో సాంగ్ కి డేట్ ని ఫిక్స్ చేశారు.

అయితే ఈసారి స్పెషల్ అప్డేట్ అని చెప్పాలి. సినిమాలో కమల్ మెయిన్ హీరో అయినప్పటికీ సిద్ధార్థ్, రకుల్ ప్రీత్ సింగ్ లపై ప్లాన్ చేసినట్టుగా ఇప్పుడు రివీల్ చేశారు. మరి ఇద్దరిపై ఓ బ్యూటిఫుల్ పోస్టర్ తో రెండో సాంగ్ ని ఈ మే 29న రిలీజ్ చేస్టున్నట్టుగా కన్ఫర్మ్ చేయగా దీనితో పాటుగా ఆడియో లాంచ్ పై కూడా అప్డేట్ ఇచ్చేసారు.

గ్రాండ్ ఆడియో లాంచ్ ని అయితే ఈ జూన్ 1న చేస్తున్నట్టుగా ప్రకటించారు. ఇది ముందు అయితే తమిళనాట జరగనుంది. నెక్స్ట్ మన తెలుగులో కూడా తప్పకుండా చేయవచ్చు. ఇక ఈ భారీ చిత్రానికి అనిరుద్ సంగీతం అందించగా లైకా ప్రొడక్షన్స్ వారు నిర్మాణం వహించారు. అలాగే ఈ జూలై 12న సినిమా పాన్ ఇండియా భాషల్లో గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు