‘ది ప్యారడైజ్’ నెక్స్ట్ సాంగ్ కి డేట్స్ వచ్చేశాయ్!

నాచురల్ స్టార్ నాని హీరోగా కయాదు లోహర్ హీరోయిన్ గా దర్శకుడు ఓదెల శ్రీకాంత్ తెరకెక్కిస్తున్న అవైటెడ్ పాన్ ఇండియా చిత్రమే ‘ది ప్యారడైజ్’. భారీ హైప్ సెట్ చేసుకున్న ఈ సినిమా నుంచి ఆల్రెడీ వచ్చిన మొదటి సాంగ్ ఆయా షేర్ సెన్సేషన్ ని సెట్ చేసింది. ఇక ఆ తర్వాత వచ్చే రెండో సాంగ్ ఎలా ఉంటుంది? ఎప్పుడు వస్తుంది అని ఎదురు చూస్తున్న అభిమానులకి ఫైనల్ గా మేకర్స్ ఓ అఫీషియల్ క్లారిటీ ఇచ్చేసారు.

దీనితో రెండో సాంగ్ ని రేపు ఆగష్టు 28న లైవ్ కచేరీలో అనిరుద్ లైవ్ పెర్ఫామెన్స్ తో ముందు రివీల్ చేయనున్నాడని తెలిపారు. ఇక ఆన్లైన్ లో ఆ నెక్స్ట్ రోజు అంటే ఆగష్టు 29న విడుదల చేస్తున్నట్టుగా ఖరారు చేశారు. ఈ సాంగ్ ని కూడా ఆయా షేర్ రచయిత కాసర్ల శ్యామ్ నే రచించగా పక్కా ఫోక్ సాంగ్ గా దీనిని అనిరుద్ అద్భుతంగా కంపోజ్ చేసినట్టు తెలుస్తుంది. సో ఈ సాంగ్ ఎలా ఉంటుందో .వేచి చూడాల్సిందే.

Exit mobile version