రేపే మహేష్ ఫ్యాన్స్ కోసం వార్నర్ స్పెషల్ సర్ప్రైజ్.!

Published on May 30, 2020 12:35 am IST

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానులు మే 31 వ తేదీ కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు. అలాగే మరోపక్క ఆస్ట్రేలియా డాషింగ్ బ్యాట్స్ మెన్ డేవిడ్ వార్నర్ మన టాలీవుడ్ హీరోల డైలాగ్స్ మరియు సాంగ్స్ తో మన వాళ్ళకి ఎక్కడ లేని ఎంటర్టైన్మెంట్ అందిస్తున్నారు.

దీనితో మహేష్ ఫ్యాన్స్ నుంచి లేటెస్ట్ బ్లాక్ బస్టర్ “సరిలేరు నీకెవ్వరు” సినిమాలోని పక్కా మాస్ బీట్ “మైండ్ బ్లాక్” సాంగ్ కు వీడియో చెయ్యమని భారీ ఎత్తున రిక్వెస్ట్ చెయ్యగా దానికి డేవిడ్ వార్నర్ మహేష్ ఫ్యాన్స్ ను సిద్ధంగా ఉండమని చెప్తున్నాడు.

రేపు మే 30న తాము ఎంతగానో అడిగిన మైండ్ బ్లాక్ సాంగ్ తో సర్ప్రైజ్ ఉంది రెడీగా ఉండమని చెప్పారు. మరి ఈ పక్కా మాస్ బీట్ లో వార్నర్ ఎలా దర్శనమిస్తాడో మహేష్ లాంటి స్టెప్స్ వేసాడో తెలియాలి అంటే రేపటి వరకు మహేష్ ఫ్యాన్స్ ఆగక తప్పదు.

సంబంధిత సమాచారం :

More