వైరల్ : రాజమౌళి తో కమర్షియల్ యాడ్ లో డేవిడ్ వార్నర్!

వైరల్ : రాజమౌళి తో కమర్షియల్ యాడ్ లో డేవిడ్ వార్నర్!

Published on Apr 12, 2024 6:01 PM IST

వరల్డ్ వైడ్ గా సూపర్ క్రేజ్ ను సొంతం చేసుకున్న స్టార్ డైరెక్టర్ ఎస్ ఎస్ రాజమౌళి తదుపరి సూపర్ స్టార్ మహేష్ బాబు తో సినిమా చేయనున్నారు. ఈ లోగా తన పర్సనల్ మరియు ప్రొఫెషనల్ లైఫ్ ను బ్యాలన్స్ చేస్తూ ఉన్నారు. తాజాగా ఒక కమర్షియల్ యాడ్ లో జక్కన్న నటించారు. విశేషం ఏమిటంటే, ఫేమస్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ ఈ యాడ్ లో తన ఎనర్జిటిక్ పెర్ఫార్మెన్స్ తో ఆకట్టుకున్నారు.

మ్యాచ్ టికెట్ల కోసం రాజమౌళి, వార్నర్ కి కాల్ చేసి అడుగుతాడు. అందుకు వార్నర్ సాధారణ క్రెడ్ upi కి అప్గ్రేడ్ చేయాలి క్యాష్ బ్యాక్ వస్తుంది అని, లేదంటే తనకి సినిమాల్లో అవకాశం ఇవ్వమని కోరతాడు. జక్కన్న రాజమౌళి ఆలోచనలో పడతాడు. వార్నర్ ను పలు పాత్రల్లో ఊహించుకుంటాడు. ఈ సీన్స్ చాలా హిలేరియస్ గా ఉన్నాయి. అందుకు విసుగు చెందిన రాజమౌళి క్రెడ్ యాప్ ను అప్ గ్రేడ్ చేసుకుంటాడు. అయితే ఈ కమర్షియల్ యాడ్ కొద్ది సేపటికే సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. డేవిడ్ వార్నర్ కి తెలుగు ఆడియెన్స్ లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. రాజమౌళి ఒక్కసారిగా డేవిడ్ వార్నర్ తో ఉన్న యాడ్ లో చూసి ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు