ఆశ్చర్యకరంగా డియర్ కామ్రేడ్ వసూళ్లు…!

ఆశ్చర్యకరంగా డియర్ కామ్రేడ్ వసూళ్లు…!

Published on Jul 30, 2019 10:43 AM IST

వారాంతం ముగిసేసరికి ప్రపంచవ్యాప్తంగా19కోట్ల వసూళ్లతో చెప్పుకోదగ్గ మార్కుని చేరుకున్న ‘డియర్ కామ్రేడ్’ మూవీ, వర్కింగ్ డే సోమవారం మాత్రం వసూళ్ల పరంగా నెమ్మదించింది. విజయ్ దేవరకొండ,రష్మిక జంటగా నటించిన ‘డియర్ కామ్రేడ్’ చిత్రం వసూళ్లు తగ్గుముఖం పట్టాయి. సోమవారం ఈ చిత్రం అన్ని ఏరియాలలో కలిపి కేవలం 95లక్షల షేర్ సాధించడం ట్రేడ్ వర్గాలను దిగ్బ్రాంతికి గురిచేసింది. ఈ చిత్రానికి వచ్చిన హైప్ కి వసూళ్లకు సంబంధం లేకపోవడం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది.

మొదటినుండి మెరుగైన వసూళ్లు రాబడుతున్న నైజాం ఏరియాలో సోమవారం బోనాలు పండుగ సందర్భంగా పాక్షిక శెలవు దినం లభించింది. ఈ సందర్భాన్ని కూడా డియర్ కామ్రేడ్ ఉపయోగించుకోలేకపోయిందనే చెప్పాలి. అలాగే అమెరికా లో కూడా ఈ చిత్ర వసూళ్లు అంత ఆశాజనకంగా ఏమీలేవు.రాత్రి 10 గంటలకు అందిన సమాచారం ప్రకారం సోమవారం $9,223 సాధించింది. ఇప్పటి వరకు యూఎస్ బాక్స్ ఆఫీస్ వద్ద ‘డియర్ కామ్రేడ్’ $695,666 వసూళ్లు పొందటం జరిగింది. సోమవారం ముగిసేనాటికి ఈ ఫిగర్ $700,000 డాలర్లకు చేరే అవకాశం కలదు.

ఇక మునుముందు ‘డియర్ కామ్రేడ్’ బాక్స్ ఆఫీస్ వద్ద ఏ రేంజ్ వసూళ్లు సాధిస్తుందో చూడాలి. ఈ చిత్రానికి భరత్ కమ్మ దర్శకత్వం వహించగా, మైత్రి మూవీ మేకర్స్ నిర్మించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు