డియర్ కామ్రేడ్ గురించి విజయ్ ఆరోపణలు నిజమేనా?

డియర్ కామ్రేడ్ గురించి విజయ్ ఆరోపణలు నిజమేనా?

Published on Sep 3, 2019 2:36 PM IST

సెన్సేషనల్ విజయ్ దేవరకొండ, రష్మిక మందాన నటించిన డియర్ కామ్రేడ్ భారీ అంచనాల మధ్య ఏకంగా నాలుగు భాషలలో విడుదలైంది. విజయ్ దేవరకొండ ఈ చిత్ర ప్రొమోషన్స్ లో భారీ ఎత్తున నిర్వహించారు. కానీ చివరకు ఈ సినిమా ఫలితం మాత్రం నిరాశ కలిగించింది. గత నెలలో డియర్ కామ్రేడ్ అమెజాన్ ప్రైమ్ వీడియో అందుబాటులోకి రావడం జరిగింది.

ఆసక్తికరంగా డిజిటల్ ప్లాట్ ఫారంలో ఈచిత్రం విశేష ఆదరణ దక్కించుకుంటుంది. తాజాగా ఈ చిత్రం చూసిన ప్రేక్షకులు డియర్ కామ్రేడ్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇలాంటి మంచి సినిమాను థియేటర్లో మిస్ అయినందుకు వారు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అలాగే ఈ మూవీపై నెగెటివ్ రివ్యూస్ ఇచ్చిన క్రిటిక్స్ పై మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో విజయ్ దేవరకొండ గతంలో చేసిన ఆరోపణలకు బలం చేకూరుతుంది. గతంలో డియర్ కామ్రేడ్ చిత్రాన్ని ఉద్దేశ పూర్వకంగా కొందరు అణగదొక్కారు అని విజయ్ అసహనం వ్యక్తం చేశారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు