డియర్ కామ్రేడ్ రికార్డు ప్రీమియర్స్ కలెక్షన్స్

డియర్ కామ్రేడ్ రికార్డు ప్రీమియర్స్ కలెక్షన్స్

Published on Jul 26, 2019 9:00 AM IST

విజయ్ దేవరకొండ లేటెస్ట్ మూవీ డియర్ కామ్రేడ్ నేడు ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా విడుదలైంది. అప్పుడే ఈ మూవీ సంచలనాలు మొదలైపోయాయి. అమెరికాలో ప్రీమియర్స్ ద్వారా ఈ మూవీ రికార్డు వసూళ్లు సాధించింది. అమెరికాలో భారత్ కంటే ఒకరోజు ముందే ప్రీమియర్స్ షోస్ వేయడం జరుగుతుంది. కాగా కేవలం ఈ ప్రీమియర్స్ ద్వారా డియర్ కామ్రేడ్ 2.5 లక్షల డాలర్స్ వసూలు చేసింది. ఈ మొత్తం రామ్ చరణ్ ‘వినయ విధేయ రామ’ చిత్ర ప్రీమియర్స్ వసూళ్ల కంటే కూడా ఎక్కువ కావడం గమనార్హం.

ఈ ఏడాదికి గాను,మహర్షి 5.16 లక్షల డాలర్లు,ఎన్టీఆర్ కథానాయకుడు 4.83 లక్షల డాలర్లు, ఎఫ్2, 2.59 లక్షల డాలర్ల వసూళ్లతో డియర్ కామ్రేడ్ కంటే ముందున్నాయి.కాగా విజయ్ కెరీర్ లో బ్లాక్ బస్టర్ చిత్రమైన ‘అర్జున్ రెడ్డి’ సినిమా ప్రీమియర్ వసూళ్ల కంటే కూడా ‘డియర్ కామ్రేడ్’ ఎక్కువ వసూళ్లు సాధించింది. డియర్ కామ్రేడ్ ఏమాత్రం హిట్ టాక్ తెచ్చుకున్నా వసూళ్ల ప్రభంజనం సృష్టించడం ఖాయంగా కనిపిస్తుంది. ‘డియర్ కామ్రేడ్’ మూవీ సౌత్ ఇండియా లోని అన్ని ప్రధాన భాషలలో విడుదలవుతుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు