బీచ్ సిటీ లో ‘డియర్ కామ్రేడ్’ సందడి…!

బీచ్ సిటీ లో ‘డియర్ కామ్రేడ్’ సందడి…!

Published on Jul 24, 2019 10:35 AM IST

“డియర్ కామ్రేడ్” ఇంకా రెండు రోజులలో సౌత్ ఇండియా మొత్తం అన్ని భాషలలో విడుదల కానుంది. ఈ మూవీ ప్రమోషన్ కొరకు విజయ్ దేవరకొండ సౌత్ ఇండియా మొత్తం తిరిగి మంచి ప్రచారం కల్పించారు. కాగా నేడు బీచ్ సిటీ వైజాగ్ వేదికగా “డియర్ కామ్రేడ్” ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగనుంది. ఈ విషయాన్ని ధృవీకరిస్తూ చిత్ర యూనిట్ ఓ పోస్టర్ ని విడుదల చేశారు. నేటి సాయంత్రం ఏడు గంటల నుండి గురజాడ కళాక్షేత్రంలో ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు.

ప్రేమకి, పోరాటానికి మధ్య మానసిక సంఘర్షణ అనుభవించే యువకుడి కథాంశంతో దర్శకుడు భరత్ కమ్మ ఈ చిత్రాన్ని తెరకెక్కించగా, మైత్రి మూవీ మేకర్స్ నిర్మించారు. “గీత గోవిందం” తరువాత రష్మిక మందాన మరో మారు, విజయ్ సరసన నటిస్తుంది.ఈ చిత్రానికి జస్టిన్ ప్రభాకరన్ సంగీతం అందించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు