‘డియర్ కామ్రేడ్’కు అమెరికాలో టికెట్లు దొరకట్లేదట

‘డియర్ కామ్రేడ్’కు అమెరికాలో టికెట్లు దొరకట్లేదట

Published on Jul 25, 2019 3:00 AM IST

DearComrade

సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ నటించిన కొత్త చిత్రం ‘డియర్ కామ్రేడ్’ 26వ తేదీల భారీ ఎత్తున విడుదలవుతున్న సంగతి తెలిసిందే. ఇక ఓవర్సీస్లో 25వ తేదీన రాత్రి నుండి ప్రీమియర్స్ ప్రదర్శించబడుతున్నాయి. కానీ సినిమాకున్న భారీ డిమాండ్ మూలాన వారం ముందే ఓపెన్ చేసిన అడ్వాన్స్ బుకింగ్స్ అన్నీ ఫుల్ అయిపోయాయి. దీంతో చాలామందికి టికెట్లు దొరకని పరిస్థితి.

దీంతో డిస్ట్రిబ్యూషన్ సంస్థ సరిగమ టికెట్లు దొరకని వారి కోసం సాయంత్రం 6 గంటల నుండి మొదలయ్యే ప్రీమియర్ షోల కంటే ముందే కొన్ని చోట్ల ఎర్లీ ప్రీమియర్ షోస్ వేయనుంది. దీన్నిబట్టి సినిమాకున్న డిమాండ్ ఏపాటిదో అర్థమవుతోంది. తెలుగు రాష్ట్రాల్లో సైతం సినిమాకు భారీ డిమాండ్ ఉంది. భరత్ కమ్మ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్, బిగ్ బెన్ సినిమాస్ సంయుక్తంగా నిర్మించాయి. ఇందులో దేవరకొండకు జోడీగా రష్మిక మందన్న నటించింది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు