‘డియర్ కామ్రేడ్’ తెలంగాణ & ఆంధ్ర లేటెస్ట్ కలెక్షన్స్ !

Published on Jul 28, 2019 10:59 am IST

భారీ అంచనాల నడుమ విజయ్ దేవరకొండ నటించిన ‘డియర్ కామ్రేడ్’ చిత్రం విడుదలై సూపర్ హిట్ టాక్ తో బాక్సాఫీస్ వద్ద సక్సెస్ ఫుల్ రెవిన్యూను రాబడుతుంది. స్టార్ హీరో రేంజ్ కలెక్షన్స్ ను సాధిస్తూ.. విజయ్ దేవరకొండ మార్కెట్ రేంజ్ ను అమాంతం పెంచేసింది ఈ సినిమా. అలాగే ఈ చిత్రం ఓవర్సీస్లో సైతం మంచి ఓపెనింగ్స్ సాదించింది.

ఇప్పటికే ఓవర్సీస్ లో విజయ్ దేవరకొండ కెరీర్ లోనే రికార్డ్ స్థాయి కలెక్షన్స్ రాబట్టిన డియర్ కామ్రేడ్.. తెలుగు రాష్ట్రాల్లో కూడా భారీ కలెక్షన్స్ ను రాబడుతుంది. మొత్తానికి విజయ్ దేవరకొండ తన కెరీర్ లోనే బెస్ట్ కలెక్షన్స్ ను అందుకున్నాడు. కాగా ఏపీ & తెలంగాణలో ‘డియర్ కామ్రేడ్’ రెండు రోజుల కలెక్షన్స్ ఎలా ఉన్నాయో పరిశీలిద్దాం.

ఏరియాల వారిగా ‘డియర్ కామ్రేడ్’ రెండు రోజుల కలెక్షన్స్ షేర్ వివరాలు..

నైజాం – 4.28 కోట్లు
సీడెడ్ – 1.28 కోట్లు
గుంటూరు – 0.80 కోట్లు
ఉత్తరాంధ్ర – 1.26 కోట్లు
తూర్పు గోదావరి – 1.07 కోట్లు
పశ్చిమ గోదావరి – 0.67 కోట్లు
కృష్ణా – 0.55 కోట్లు
నెల్లూరు – 0.36 కోట్లు

తెలంగాణ & ఏపీలో ‘డియర్ కామ్రేడ్’ రెండు రోజుల కలెక్షన్ల షేర్ : రూ. 10.27 కోట్లు.

సంబంధిత సమాచారం :