‘డియర్ కామ్రేడ్’ నైజాం లేటెస్ట్ కలెక్షన్స్ !

‘డియర్ కామ్రేడ్’ నైజాం లేటెస్ట్ కలెక్షన్స్ !

Published on Jul 28, 2019 10:42 AM IST

సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ క్రేజీ బ్యూటీ రష్మికా మండన్న రెండవ సారి జంటగా భరత్ కమ్మ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘డియర్ కామ్రేడ్’. మైత్రి మూవీ మేకర్స్, బిగ్ బెన్ సినిమాస్ వారు సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. కలెక్షన్స్ పరంగా కూడా డియర్ కామ్రేడ్ డీసెంట్ కలెక్షన్స్ ను రాబడుతుంది. మొదటి రోజునే ప్రపంచవ్యాప్తంగా రూ .11 కోట్ల షేర్ రాబట్టి అందరినీ ఆశ్చర్యపరిచిన విషయం తెలిసిందే.

కాగా నైజాంలో డియర్ కామ్రేడ్ చిత్రం మొదటి రోజు 2.73 కోట్ల పైగా షేర్ సాధించింది. అలాగే శనివారం నాడు కూడా నైజాంలో 1.54 కోట్ల రూపాయల షేర్ వసూలు చేసి.. మొత్తం రెండు రోజులకు గానూ నైజాంలో రూ .4.28 కోట్ల షేర్ ను రాబట్టింది. జస్టిన్ ప్రభాకరన్ ఈ సినిమాకి సంగీతం అందించారు. శృతి రామచంద్రన్, చారుహాసన్ ముఖ్యపాత్రాలలో నటించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు