ఓటిటి లోకి వచ్చిన డియర్…ఇక్కడైనా మెప్పిస్తుందా?

ఓటిటి లోకి వచ్చిన డియర్…ఇక్కడైనా మెప్పిస్తుందా?

Published on Apr 28, 2024 4:35 PM IST

జివి ప్రకాష్ కుమార్ మరియు ఐశ్వర్య రాజేష్ ప్రధాన పాత్రల్లో, ఇటీవల విడుదలైన కోలీవుడ్ చిత్రం డియర్ (DeAr). ఏప్రిల్ 11, 2024న తమిళంలో విడుదలైన ఈ చిత్రం, ఆ మరుసటి రోజు తెలుగులోనూ విడుదల అయ్యింది. ఈ చిత్రం ప్రేక్షకులని అలరించడం లో విఫలం అయ్యింది. థియేటర్లలో విడుదలైన రెండు వారాల తర్వాత, ఈ చిత్రం ఇప్పుడు తమిళం, తెలుగు, కన్నడ, మలయాళం మరియు హిందీ భాషల్లో నెట్‌ఫ్లిక్స్‌ లో ప్రసారం చేయడానికి అందుబాటులో ఉంది.

ఈ చిత్రంలో కాళి వెంకట్, రోహిణి మొల్లేటి, ఇళవరసు, గీతా కైలాసం తదితరులు కీలక పాత్రలు పోషించారు. జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందించిన ఈ చిత్రానికి వరుణ్ త్రిపురనేని, అభిషేక్ రామిశెట్టి, జి పృథ్వీరాజ్ నిర్మాతలు గా వ్యవహరిస్తున్నారు. థియేటర్ల లో ఏ మాత్రం ఆకట్టుకొని ఈ చిత్రం, డిజిటల్ ప్రీమియర్ గా ఎలాంటి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంటుందో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు