బుల్లితెర పై ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ కి డీసెంట్ రెస్పాన్స్!

బుల్లితెర పై ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ కి డీసెంట్ రెస్పాన్స్!

Published on Apr 12, 2024 7:39 PM IST

టాలీవుడ్ హీరో నితిన్ (Nithiin) ప్రధాన పాత్రలో, వక్కంతం వంశీ దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్ ఎంటర్టైనర్ ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్. ఈ చిత్రం థియేటర్ల లో రిలీజ్ అయ్యి ప్రేక్షకులను అలరించడం లో విఫలం అయ్యింది. యంగ్ బ్యూటీ శ్రీ లీల హీరోయిన్ గా నటించిన ఈ చిత్రాన్ని శ్రేష్ఠ్ మూవీస్ మరియు రుచిర ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ లపై నిర్మించడం జరిగింది.

ఈ చిత్రం ఇటీవల స్టార్ మా ఛానెల్ లో వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా బుల్లితెర ప్రేక్షకుల ముందుకి వచ్చింది. ఈ చిత్రం కి సంబందించిన టీఆర్పీ రేటింగ్ తాజాగా వెలువడింది. ఈ చిత్రం కి 5.16 టీఆర్పీ రేటింగ్ రావడం జరిగింది. ఇది డీసెంట్ రెస్పాన్స్ అని చెప్పాలి. ఈ చిత్రం కి హరీశ్ జయరాజ్ సంగీతాన్ని అందించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు