రెండోసారి డీసెంట్ టీఆర్పీ రేటింగ్ రాబట్టిన “జైలర్”

రెండోసారి డీసెంట్ టీఆర్పీ రేటింగ్ రాబట్టిన “జైలర్”

Published on Feb 22, 2024 10:36 PM IST

సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రధాన పాత్రలో, డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం లో తెరకెక్కిన యాక్షన్ ఎంటర్టైనర్ జైలర్. ఈ చిత్రం థియేటర్ల లో రిలీజ్ అయ్యి ప్రేక్షకులను, అభిమానులని విశేషం గా ఆకట్టుకుంది. బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబట్టి, సెన్సేషన్ క్రియేట్ చేయడం జరిగింది. ఈ చిత్రం మరోసారి ప్రముఖ టీవీ ఛానల్ అయిన జెమిని టీవీ లో ప్రసారం అయ్యింది.

ఈ చిత్రం రెండో సారి డీసెంట్ టీఆర్పీ రేటింగ్ ను రాబట్టడం జరిగింది. ఈ చిత్రం రెండో టెలికాస్ట్ లో 3.82 టీఆర్పీ రేటింగ్ ను సొంతం చేసుకుంది. మొదటి సారి 6.3 టీఆర్పీ రేటింగ్ nu రాబట్టిన సంగతి తెలిసిందే. శివ రాజ్ కుమార్, మోహన్ లాల్, రమ్య కృష్ణ, జాకీ ష్రాఫ్, యోగి బాబు, సునీల్, వినాయకన్, తమన్నా తదితరులు కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి అనిరుద్ రవి చందర్ సంగీతం అందించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు