ప్రభాస్ 21లో దీపిక నటించే అవకాశం ఉంది?

Published on May 31, 2020 11:19 am IST

ప్రస్తుతం రాధా కృష్ణ దర్శకత్వంలో పీరియాడిక్ లవ్ డ్రామా చేస్తున్న ప్రభాస్ తన నెక్స్ట్ మూవీ మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ తో ప్రకటించిన సంగతి తెలిసిందే. టాలీవుడ్ సీనియర్ ప్రొడ్యూసర్ అశ్విన దత్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా భారీ పాన్ ఇండియా మూవీగా విడుదల కానుంది. ఈ ఏడాది చివర్లో సెట్స్ పైకి వెళ్లనున్న ఈ మూవీ 2022 సమ్మర్ లో విడుదల అయ్యే సూచనలు కలవు.

కాగా ఈ చిత్ర హీరోయిన్ పై కొద్దిరోజులుగా పరిశ్రమలో అనేక పుకార్లు పుట్టుకు వచ్చాయి. మొదట దీపికా పదుకొనె ఆతరువాత అలియా భట్, కత్రినా ఖైఫ్ ఇలా అనేక పేర్లు వినిపించాయి. ఐతే ఈ మూవీలో దీపికా నటించే అవకాశం ఉందేమో అనిపిస్తుంది. దీపిక తన ఇంస్ట్గ్రామ్ లో నాగ్ అశ్విన్ డైరెక్షన్ లో వచ్చిన మహానటి మూవీ చూడాలని ఫ్యాన్స్ ని కోరుకుంది. ఈ పరిణామాలు చూస్తుంటే ప్రభాస్ మూవీలో దీపికా ఫిక్స్ అయ్యిందేమో అనిపిస్తుంది.

సంబంధిత సమాచారం :

More