మరో బిగ్ ఛాన్స్ కోల్పోయిన దీపిక.. ఈసారి ఎక్కడంటే..?

Deepika Padukone 1

బాలీవుడ్ భామ దీపికా పదుకొనె ఇటీవల వార్తల్లో నిలుస్తూ అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఆమె పెట్టిన కండీషన్స్ కారణంగా ఆమె ఒప్పుకున్న ప్రాజెక్టులు వరుసగా చేజారిపోతున్నాయి. ఇప్పటికే టాలీవుడ్‌లో తెరకెక్కుతున్న ‘స్పిరిట్’, ‘కల్కి 2’ ప్రాజెక్టులను ఆమె కోల్పోయింది. ఆమె బ్యాడ్ లక్ ఇక్కడితో ఆగలేదు.

తాజాగా దీపికా పదుకొనె ఓ హాలీవుడ్ ఛాన్స్ కూడా మిస్ చేసుకున్నట్లు తెలుస్తోంది. హాలీవుడ్‌లో పాపులర్ అయిన ‘ది వైట్ లోటస్’ సిరీస్ 4వ సీజన్ కోసం దీపికా పదుకొనే పేరును మేకర్స్ పరిశీలించారట. అయితే, దీని కోసం ఆమెను ఆడిషన్‌కు రావాల్సిందిగా మేకర్స్ కోరారట. కానీ, తాను ఆడిషన్‌కు రాలేనని దీపికా తేల్చి చెప్పిందట. దీంతో ఆమె స్థానంలో మరో నటిని తీసుకునేందుకు ‘ది వైట్ లోటస్’ టీమ్ రెడీ అయింది.

ఇలా పేరొందిన సిరీస్ నుంచి ఛాన్స్ మిస్ చేసుకోవడంతో దీపికా ఫ్యాన్స్ నిరాశకు గురవుతున్నారు. గతంలో ‘XXX: రిటర్న్ ఆఫ్ క్సాండర్ కేజ్’ అనే చిత్రంతో హాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చింది దీపికా. ఆ తర్వాత ఆమెకు గ్యాప్ రావడంతో, ఇప్పుడు మంచి కమ్‌బ్యాక్ ఇచ్చే అవకాశం ఉన్నా, దానిని చేజార్చుకుందని పలువురు కామెంట్స్ చేస్తున్నారు.

Exit mobile version