ప్రీ రిలీజ్ వేడుకలో ‘డిగ్రీ కాలేజ్’ !

ప్రీ రిలీజ్ వేడుకలో ‘డిగ్రీ కాలేజ్’ !

Published on Feb 3, 2020 2:00 PM IST

శ్రీ లక్ష్మీ నరశీంహ సినిమా పతాకం పై వరుణ్, దివ్య రావు జంటగా నరశింహనంది స్వీయ దర్శకత్వంలో రూపొందించిన చిత్రం డిగ్రీ కాలేజ్. ఈ నెల 7 న ఈ చిత్రం విడుదల అవుతుంది. కాగా డిగ్రీ కాలేజ్ ప్రి రిలీజ్ వేడుక హైదరాబాద్ లోని ప్రసాద్ లాబ్ లో ఘనంగా జరిగింది . ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య, ప్రముఖ దర్శకుడు తమ్మారెడ్డి భరద్వాజ, నిర్మాతల మండలి అధ్యక్షుడు సి కళ్యాణ్ లు ముక్యా అతిధులు గా వచ్చి ఈ చిత్రము యోక్క ట్రైలర్ ను లాంచ్ చేసారు.

అనంతరం, సి కళ్యాణ్ మాట్లాడుతూ* – ఈ సినిమా లో రొమాన్స్ మోతాదుకు మించి ఉన్నా.. ఇందూలో ఏదో పాయింట్ ఉనట్లూ ట్రైలర్ చూస్తే తెలుస్తుంది. నరసింహ నంది కంటెంట్ ఉన్న సినిమాలు తీస్తాడు, కులాలాను కుడా ఇందులో టచ్ చెసినట్లు ఉన్నాడు .డిస్ట్రిబ్యూటర్ బాపిరాజు గారు సినిమా బాగుంటేనే తీసుకుంటాడు. అలాంటిది అతను ఈ సినిమాను తన బుజాలపైన వెసుకోని డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాడు అంటే ఈ సినిమా తప్పక విజయం సాధిస్తుంది అని అర్థమవుతుంది. ఈ సినిమా ద్వారా చిత్ర యూనిట్ కు, నరసింహకు మంచి పేరు తీసుకొచ్చి మరిన్ని సినిమాలు చెయ్యాలని అన్నారు. మంత్రి పొన్నాల లక్ష్మయ్య మాట్లాడుతూ* – నేను, తమ్మారెడ్డి భరద్వాజ ఇంజనీరింగ్ కాలేజీలో బ్యాచ్‌ మేట్స్. సినిమా అంటే చైతన్యమ్, వినోదం, విజ్ఞానం, స్ఫూర్తిదాయకం ఉందని మెము బావిస్తున్నాము. ఈ సినిమాలో వినోధం ఎక్కువ ఉన్నా అది సినిమా లో కథను దృష్టిలో పెట్టుకొని తీశామన్నాడు దర్శకుడు. నేను గత 30 సంవత్సరాలుగా సినిమాలు చూడలేదు. అంతకు ముందు అప్పుడప్పుడు సినిమాలు చూసేవాడిని. 1951లో నేను చూసిన మొదటి సినిమా రోజులు మారాయి. అది కూడా ఆ సినిమా 100వ రోజున 6 అణాల టికెట్ ను 9 అణాలకు కొని చూసాను. దేశంలో తెలుగు సినిమాల ప్రాధాన్యత ఎక్కువగా ఉంది. అందులో అత్యంత ఎక్కువ సినిమాలు హైదరాబాద్ లోనే తీస్తున్నారు. ఆస్కార్ అవార్డు వచ్చిన ‘లైఫ్ ఆఫ్ పై’ సినిమాను కూడా హైదరాబాద్ లో 90% షూటింగ్ చేశారు. కాబట్టి ప్రతిభకు అవకాశాలు కలిపిస్తే నాన్యతకు,సందేశాలను అవకాశం ఏర్పడుతుంది అన్నారు.

దర్శకుడు నరసింహనంది మాట్లాడుతూ* – ‘1940’ అనే సినిమా తీసి జాతీయ అవార్డు, నంది అవార్డ్ తెచ్చుకున్న దర్శకుడైన మీరు ఎందుకు ఇలాంటి సినిమా తీశారని చాలా డిబేట్స్ లో ఛానెల్స్ వారు అడిగారు. అయితే ఈ సినిమా నిజ జీవితానికి దగ్గరగా ఉంటుంది. ఇందులో బలమైన కథ ఉంది, ఒక అమ్మాయి, ఒక అబ్బాయి కి నిజజీవితం లో జరిగిన యదార్థ సంఘటన విని ఉద్వేగనికి లోనై.. వారి ప్రేమ ఎక్కడ మొదలై, ఎక్కడ పూర్తయిందనే విషయాన్ని ప్రేక్షకులతో పంచు కోవాలని చెస్తున్న సినిమానే’ డిగ్రీ కాలేజ్.ఇందులో ఒక మంచి కంటెంట్ ఉంది.ఇందులో మోతాదుకు మించి సీన్స్ ఉన్నాకుడా..ఇందులో పెట్టిన ప్రతి సీన్ కథకు బలమైన కారణం ఉండే తీశాము.

ఈ సినిమాలో నటీనటులు హీరో వరుణ్, హీరోయిన్-దివ్య రావు, దువ్వాసి మోహన్, జయవాని, ఆర్.కె, రవిరెడ్డి, అనిల్ మైవిలేజ్ షో, మదన్, శ్రీనివాస్, సలీం, మల్లేశ్ తెల్జేరి, చంద్రముఖి మువ్వల, యోగి భూచేపల్లి, వీర భద్రమ్. అలాగే సాంకేతిక నిపుణులు సంగీత-సునీల్ కశ్యప్, కెమెరామెన్: మురళి మోహన్ రెడ్డి
ఎడిటింగ్- వి. నాగిరెడ్డి, సహా నిర్మాతలు-ఆలేటి శ్రీనివాస్ రావు, బత్తుల కొండయ్య, రవిరెడ్డి నిర్మాత- శ్రీ లక్ష్మి నరసింహ సినిమా కథ-స్క్రీన్ ప్లే-మాటలు-దర్శకత్వం-నరశింహ నంది

సంబంధిత సమాచారం

తాజా వార్తలు