“దేవర” రెండో సాంగ్ వైబ్స్ స్టార్ట్

“దేవర” రెండో సాంగ్ వైబ్స్ స్టార్ట్

Published on Jul 2, 2024 11:59 AM IST


పాన్ ఇండియా మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ (Jr NTR) హీరోగా జాన్వీ కపూర్ (Janhvi Kapoor) హీరోయిన్ గా దర్శకుడు కొరటాల శివ తెరకెక్కిస్తున్న అవైటెడ్ పాన్ ఇండియా చిత్రం “దేవర” కోసం అందరికీ తెలిసిందే. అయితే ఈ చిత్రం షూటింగ్ దాదాపు పూర్తి కావస్తుండగా సినిమా నుంచి ఆల్రెడీ వచ్చిన ఫస్ట్ సింగిల్ సెన్సేషనల్ హిట్ అయ్యింది. అయితే ఈ సాంగ్ తర్వాత ఇక నెక్స్ట్ అంతా రెండో సాంగ్ కోసం ఎదురు చూస్తున్నారు.

అయితే సంగీత దర్శకుడు అనిరుద్ రెండో సాంగ్ గా కూడా మరో సాలిడ్ చార్ట్ బస్టర్ ని అందించినట్టుగా టాక్ ఉంది. అయితే ఇప్పుడు ఈ జూలై తోనే రెండో సాంగ్ వైబ్స్ స్టార్ట్ అయ్యాయి. అలాగే ఈ జూలై లోనే సాంగ్ పై కూడా ఓ క్లారిటీ రానుంది అని టాక్. మరి ఈ నెలలోనే దేవర రెండో సాంగ్ లాంచ్ అవుతుందో ఏమో అనేది చూడాలి. ఇక ఈ భారీ చిత్రంలో సైఫ్ అలీఖాన్ విలన్ గా నటిస్తుండగా ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ వారు సంయుక్తంగా నిర్మాణం వహించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు