మిక్స్డ్ టాక్ తో “దేవర” సాంగ్ కి సెన్సేషనల్ రెస్పాన్స్

మిక్స్డ్ టాక్ తో “దేవర” సాంగ్ కి సెన్సేషనల్ రెస్పాన్స్

Published on May 23, 2024 12:06 PM IST

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ (Jr NTR) హీరోగా బాలీవుడ్ స్టార్ బ్యూటీ జాన్వీ కపూర్ (Janhvi Kapoor) హీరోయిన్ గా దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్ లో చేస్తున్న భారీ పాన్ ఇండియా చిత్రం “దేవర” కోసం అందరికీ తెలిసిందే. మరి ఇటీవల కాలంలో ఏ సినిమా ఫస్ట్ సింగిల్ కి కూడా రాని భారీ స్థాయి హైప్ ఈ చిత్రానికి వచ్చింది.

అలా అనిరుద్ కంపోజ్ చేసిన ఫియర్ సాంగ్ ఎట్టకేలకి పాన్ ఇండియా భాషల్లో రిలీజ్ చేయగా దీనికి స్టార్టింగ్ లో మిక్స్డ్ టాక్ నే వచ్చింది కానీ నెమ్మదిగా ఊపందుకుంది. అయితే ఈ సాంగ్ ఈ టాక్ తోనే ఇప్పుడు సెన్సేషనల్ మార్క్ ని అందుకుంది. అన్ని భాషల్లో కలిపి ఈ మూడు రోజుల్లోనే 50 మిలియన్ వ్యూస్ ని దాటేసి ఇంకా స్ట్రాంగ్ గా దూసుకెళ్తుంది.

మెయిన్ గా మన తెలుగు, హిందీ భాషల్లో ఈ సాంగ్ కి సాలిడ్ వ్యూస్ వస్తున్నాయి. ఇక ఈ చిత్రంలో సైఫ్ అలీఖాన్ విలన్ (Saif Ali Khan) రోల్ లో నటిస్తుండగా యువసుధ ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ వారు నిర్మాణం వహిస్తున్నారు. అలాగే ఈ అక్టోబర్ 10న సినిమా పాన్ ఇండియా భాషల్లో రిలీజ్ కాబోతుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు