గ్లోబల్ ఛార్ట్స్ లో “దేవర” సెన్సేషన్.!

గ్లోబల్ ఛార్ట్స్ లో “దేవర” సెన్సేషన్.!

Published on May 28, 2024 3:22 PM IST

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ (Jr NTR) హీరోగా జాన్వీ కపూర్ (Janhvi Kapoor) హీరోయిన్ గా దర్శకుడు కొరటాల శివ తెరకెక్కిస్తున్న భారీ పాన్ ఇండియా చిత్రం “దేవర” కోసం అందరికీ తెలిసిందే. మరి ఈ చిత్రం నుంచి మేకర్స్ రీసెంట్ గానే అవైటెడ్ ఫస్ట్ సింగిల్ ని రిలీజ్ చేయగా ఇది పాన్ ఇండియన్ చార్ట్ బస్టర్ గా నిలిచింది.

అనిరుద్ (Anirudh) కంపోజ్ చేసిన ఈ ఫియర్ సాంగ్ అయితే ఇప్పుడు గ్లోబల్ లెవెల్లో సెన్సేషన్ సెట్ చేస్తుంది. వరల్డ్ వైడ్ గా యూట్యూబ్ మ్యూజిక్ ఛార్ట్స్ లో ఈ ఫియర్ సాంగ్ ప్రస్తుతం టాప్ 100 పాటల్లో 29వ స్థానంలో ట్రెండ్ అవుతూ ఉండడం విశేషం. దీనితో ఈ సాంగ్ సెన్సేషన్ ఏ లెవెల్లో ఉందో అర్ధం చేసుకోవచ్చు.

ఇప్పటికే తెలుగు, హిందీ భాషల్లో అయితే భారీ రెస్పాన్స్ ని కొనసాగిస్తుంది. దీనితోనే గ్లోబల్ ఛార్ట్స్ లో కూడా అదరగొట్టడం విశేషం. ఇక ఈ భారీ చిత్రంలో సైఫ్ అలీఖాన్ విలన్ గా నటిస్తుండగా ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ వారు నిర్మాణం వహిస్తున్నారు. అలాగే ఈ అక్టోబర్ 10న సినిమా పాన్ ఇండియా భాషల్లో రిలీజ్ కాబోతుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు