పవర్ఫుల్ గా “దేవర” మొదటి సాంగ్.!

పవర్ఫుల్ గా “దేవర” మొదటి సాంగ్.!

Published on May 19, 2024 7:54 PM IST

ప్రస్తుతం మ్యూజిక్ లవర్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న అవైటెడ్ ఫస్ట్ సింగిల్ ఏదన్నా ఉంది అంటే అది డెఫినెట్ గా మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ హీరోగా జాన్వీ కపూర్ టాలీవుడ్ డెబ్యూ ఇస్తూ చేసిన భారీ చిత్రం “దేవర” సాంగ్ అని చెప్పాలి. దర్శకుడు కొరటాల శివ తెరకెక్కిస్తున్న ఈ సినిమాకి అనిరుద్ సంగీతం అందిస్తున్నాడు.

అయితే ఈ ఫస్ట్ సింగిల్ కి ఎంతో హైప్ ఇవ్వగా ఇప్పుడు ఎట్టకేలకు సాంగ్ రిలీజ్ అయ్యింది. ఇక ఈ సాంగ్ మాత్రం మంచి పవర్ఫుల్ గా ఉందని చెప్పాలి. తారక్ పాత్రపై మంచి ఎలివేషన్స్ వేస్తూ సాగిన సాహిత్యం అనిరుద్ గాత్రంతో బాగుంది. మెయిన్ గా సాంగ్ డిజైన్ చూసేందుకు సూపర్బ్ గా ఉందని చెప్పాలి. ఈ విషయంలో అనిరుద్ మరోసారి తన మార్క్ చూపించాడు.

అలాగే తారక్ పై చూపించిన కొన్ని విజువల్స్ సాంగ్ చివరలో తన ప్రెజెన్స్ ఎక్స్ లెంట్ గా ఉన్నాయి. ఓవరాల్ గా మాత్రం ఫ్యాన్స్ కి ట్రీట్ ఇచ్చేలా ఈ సాంగ్ ఉంది అని చెప్పవచ్చు. ఇక ఈ భారీ సినిమాకి ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ వారు నిర్మాణం వహిస్తుండగా ఈ అక్టోబర్ 10న సినిమా పాన్ ఇండియా భాషల్లో రిలీజ్ కాబోతోంది.

సాంగ్ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

సంబంధిత సమాచారం

తాజా వార్తలు