‘దేవర’ : గోవా షెడ్యూల్ లో జాయిన్ అయిన జాన్వీ కపూర్

‘దేవర’ : గోవా షెడ్యూల్ లో జాయిన్ అయిన జాన్వీ కపూర్

Published on Mar 25, 2024 11:36 PM IST

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా జాన్వీ కపూర్ హీరోయిన్ గా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ దేవర పార్ట్ 1. అనిరుద్ సంగీతం అందిస్తున్న ఈ మాస్ యాక్షన్ మూవీని యువ సుధా ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంస్థలు అత్యంత ప్రతిష్టాత్మకంగా పాన్ ఇండియన్ రేంజ్ లో నిర్మస్తున్నాయి. ఇప్పటికే చాలావరకు షూటింగ్ జరుపుకున్న ఈమూవీ పై ఎన్టీఆర్ ఫ్యాన్స్ తో పాటు ఆడియన్స్ అందరిలో ఎన్నో అంచనాలు ఉన్నాయి.

విషయం ఏమిటంటే, తాజాగా ఈ మూవీ గోవాలో జరుగుతున్న షెడ్యూల్ లో పాల్గొంటున్నట్లు తన ఇన్స్టాగ్రామ్ వేదికగా నేడు ఒక పోస్ట్ చేసారు జాన్వీ కపూర్. కొన్నాళ్ల పాటు ఆమె సహా పలువురు కీలక పాత్రధారుల మధ్య ముఖ్యమైన సన్నివేశాలు చిత్రీకరించనున్నారు. ఇక ఈ మూవీని అన్ని కార్యక్రమాలు ముగించి అక్టోబర్ 10న గ్రాండ్ గా ఆడియన్స్ ముందుకి తీసుకురానున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు