‘దేవర’ లేటెస్ట్ షూట్ అప్ డేట్

‘దేవర’ లేటెస్ట్ షూట్ అప్ డేట్

Published on Feb 27, 2024 9:09 PM IST

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా జాన్వీ కపూర్ హీరోయిన్ గా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ యాక్షన్ మాస్ ఎంటర్టైనర్ మూవీ దేవర పార్ట్ 1. ఈ మూవీని ఎంతో ఎంతో ప్రతిష్టాత్మకంగా భారీ వ్యయంతో ఎన్టీఆర్ ఆర్ట్స్, యువ సుధా ఆర్ట్స్ సంస్థలు నిర్మిస్తున్నాయి.

ఇప్పటికే ఆల్మోస్ట్ చాలా వరకు షూటింగ్ జరుపుకున్న దేవర తాజాగా షెడ్యూల్ హైదరాబాద్‌లో ప్రారంభం కాగా దీనిని 10 నుండి 15 రోజులు జరుపనున్నారట. ఈ షెడ్యూల్ లో పలు కీలక సీన్స్ అనంతరం మూడు డ్యూయెట్‌లతో సహా మొత్తం నాలుగు పాటలను చిత్రీకరించనున్నారని తెలుస్తోంది.

ఇక త్వరలోనే షూట్ మొత్తం పూర్తి చేసి అక్కడి నుండి ఒక్కొక్కటిగా అప్ డేట్స్ అందించడంతో పాటు ప్రమోషనల్ ఈవెంట్స్ పై గట్టిగా దృష్టి పెట్టనుందట దేవర టీమ్. కాగా ఈ మూవీ అక్టోబర్ 10న దసరా కానుకగా ఆడియన్స్ ముందుకి రానున్న విషయం తెలిసిందే.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు