పవర్ ఫుల్ పోస్టర్ తో “దేవర” సరికొత్త రిలీజ్ డేట్ ఫిక్స్!

పవర్ ఫుల్ పోస్టర్ తో “దేవర” సరికొత్త రిలీజ్ డేట్ ఫిక్స్!

Published on Feb 16, 2024 4:00 PM IST


గ్లోబల్ స్టార్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రధాన పాత్రలో, డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వం లో తెరకెక్కుతున్న భారీ యాక్షన్ ఎంటర్టైనర్ దేవర. యువ సుధ ఆర్ట్స్ మరియు ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ లపై సుధాకర్ మిక్కిలినేని, కే. హరికృష్ణ, నందమూరి కళ్యాణ్ రామ్ లు సంయుక్తం గా నిర్మిస్తున్న ఈ చిత్రం లో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది. బాలీవుడ్ స్టార్ యాక్టర్ అయిన సైఫ్ అలీఖాన్ విలన్ పాత్రలో నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుండి రిలీజైన ప్రచార చిత్రాలకి ప్రేక్షకుల నుండి, అభిమానుల నుండి సూపర్ రెస్పాన్స్ వచ్చింది.

తాజాగా ఈ చిత్రం కి సంబందించిన రిలీజ్ డేట్ పై మేకర్స్ సరికొత్త అప్డేట్ ఇచ్చారు. ఈ చిత్రాన్ని అక్టోబర్ 10, 2024 న వరల్డ్ వైడ్ గా థియేటర్ల లో రిలీజ్ చేస్తున్నట్లు తెలిపారు. ఇదే విషయాన్ని వెల్లడించడానికి ఎన్టీఆర్ పవర్ ఫుల్ పోస్టర్ ను విడుదల చేసారు. ఈ పోస్టర్ ఆడియెన్స్ ను విశేషం గా ఆకట్టుకుంటుంది. దేవర పార్ట్ 1 పై ప్రేక్షకుల్లో, అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. అనిరుద్ రవి చందర్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు