‘దేవర’ నెక్స్ట్ షెడ్యూల్ అప్ డేట్

‘దేవర’ నెక్స్ట్ షెడ్యూల్ అప్ డేట్

Published on Mar 27, 2024 3:34 AM IST

టాలీవుడ్ గ్లోబల్ స్టార్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో చేస్తోన్న మూవీ దేవర పార్ట్ 1. ఈ మూవీ పాన్ ఇండియన్ రేంజ్ లో హై బడ్జెట్ తో రూపొందుతుండగా జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. యువ సుధా ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంస్థలు కలిసి నిర్మిస్తోన్న ఈ మూవీకి అనిరుద్ సంగీతం అందిస్తుండగా రత్నవేలు ఫొటోగ్రఫి అందిస్తున్నారు.

విషయం ఏమిటంటే, తాజాగా గోవాలో ప్రారంభం అయిన దేవర మూవీ షెడ్యూల్ నేటితో కంప్లీట్ అయింది. ఈ షెడ్యూల్ లో కొన్ని కీల సీన్స్, ఒక మోంటేజ్ సాంగ్ చిత్రీకరించారు. ఇక ఏప్రిల్ లో హైదరాబాద్ లో నెక్స్ట్ షెడ్యూల్ జరుగనుంది. అన్ని కార్యక్రమాలు ముగించి దేవర మూవీని అక్టోబర్ 10న గ్రాండ్ గా పలు భాషల ఆడియన్స్ ముందుకి తీసుకురానున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు