“దేవర” నార్త్ బిజినెస్ పై లేటెస్ట్ బజ్.!

“దేవర” నార్త్ బిజినెస్ పై లేటెస్ట్ బజ్.!

Published on Apr 18, 2024 9:00 AM IST


మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ (Jr NTR) హీరోగా జాన్వీ కపూర్ (Janhvi Kapoor), సైఫ్ అలీఖాన్ లాంటి బాలీవుడ్ స్టార్స్ టాలీవుడ్ డెబ్యూ ఇస్తూ చేస్తున్న లేటెస్ట్ భారీ చిత్రమే “దేవర”. దర్శకుడు కొరటాల శివ తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై మంచి అంచనాలు నెలకొనగా ఈ సినిమాకి ఎన్టీఆర్ కెరీర్ లోనే రికార్డు బిజినెస్ ఈ చిత్రానికి జరిగినట్టుగా టాక్ వచ్చింది.

అయితే ఇప్పుడు ఈ సినిమా నార్త్ మార్కెట్ కి సంబంధించి అప్డేట్ తెలుస్తుంది. దీని ప్రకారం దేవర హిందీ హక్కులు మొత్తం 50 కోట్లకి అమ్ముడు పోయాయట. దీనితో RRR అనంతరం ఎన్టీఆర్ స్ట్రైట్ ఎన్టీఆర్ సినిమాకి ఈ మొత్తం ఎక్కువే అని చెప్పాలి. మరి రిలీజ్ అయ్యాక ఈ సినిమా ఎలా పెర్ఫామ్ చేస్తుంది అనేది ప్రశ్నగా మారింది.

ఎలానో నార్త్ మార్కెట్ పై ఎన్టీఆర్ కన్నేశాడు. నెక్స్ట్ పలు సినిమాలు కూడా రానున్నాయి, యష్ రాజ్ ఫిల్మ్స్ స్పై యూనివర్స్ లో జాయిన్ అవ్వడం ఇప్పుడు “వార్ 2” (War 2) లో పాల్గొనడంతో నార్త్ ఆడియెన్స్ కి మరింత దగ్గరయ్యాడు తారక్. మరి దేవర తో ఎలాంటి సెన్సేషన్ ని తాను సెట్ చేస్తాడో వేచి చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు