‘ఎల్లమ్మ’తో పర్శి గా పరిచయమైన దేవిశ్రీ ప్రసాద్

Yellamma

వేణు యెల్దండి దర్శకత్వంలో సూపర్ హిట్ ‘బలగం’ తర్వాత రూపొందుతున్న రెండో చిత్రం ‘ఎల్లమ్మ’ గురించి ఇప్పటికే చాలా చర్చ జరిగింది. ఈ గ్రామీణ నేపథ్య ఎంటర్‌టైనర్ నుంచి నేచురల్ స్టార్ నాని, హీరో నితిన్ కొన్ని తెలియని కారణాలతో తప్పుకున్నట్లు వార్తలు వచ్చాయి. ఆ తర్వాత, ప్రముఖ సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ హీరోగా నటిస్తూ ఈ సినిమాతో నటుడిగా అరంగేట్రం చేయబోతున్నాడనే ఊహాగానాలు జోరుగా వినిపించాయి.

ఇప్పుడు ఆ ఊహాగానాలకు ముగింపు పలుకుతూ, ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్‌నే హీరోగా ఖరారు చేసినట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. మకర సంక్రాంతి సందర్భంగా విడుదల చేసిన ఫస్ట్ గ్లింప్స్‌లో దేవిశ్రీ ప్రసాద్‌ను ‘పర్శి’ అనే పాత్రలో పరిచయం చేశారు. గ్లింప్స్‌లోని విజువల్స్‌తో పాటు బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా ఆసక్తికరంగా ఉండటంతో సినిమాపై క్యూరియాసిటీ మరింత పెరిగింది.

ఈ చిత్రంలో దేవిశ్రీ ప్రసాద్ లుక్ ప్రత్యేకంగా ఆకట్టుకుంటోంది. అయితే, హీరోయిన్‌గా ఎవరు నటించబోతున్నారన్న విషయం మాత్రం ఇంకా వెల్లడించలేదు. ముఖ్యంగా, ఈ సినిమాకు సంగీతం కూడా దేవి శ్రీ ప్రసాద్‌నే అందించనుండటం విశేషం. దిల్ రాజుతో కలిసి శిరీష్ ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. కాగా, ఈ మూవీ ఆడియో హక్కులను టి-సిరీస్ సొంతం చేసుకుంది.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Exit mobile version