
డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ తో చేయనున్న సినిమా స్క్రిప్ట్ వర్క్ లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమాకి సంబందించిన టెక్నికల్ టీం ని ఇది వరకూ అనౌన్స్ చేయలేదు. మాకు అందిన వార్తల ప్రకారం ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ గా దేవీశ్రీ ప్రసాద్ ని ఎంపిక చేసారని సమాచారం. ఎన్.టి.ఆర్ – పూరి జగన్నాధ్ – దేవీశ్రీ ప్రసాద్ కాంబినేషన్లో సినిమా అనగానే అందరూ ఆసక్తిచూపడమే కాకుండా సూపర్ హిట్ ఆల్బమ్ వస్తుందని ఆశిస్తున్నారు.
ఈ విషయంపై త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడుతుంది. ఎన్.టి.ఆర్ సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీకి వక్కంతం వంశీ కథని అందించాడు. ఎన్.టి.ఆర్ తో ‘బాద్షా’ లాంటి బ్లాక్ బస్టర్ అందుకున్న బండ్ల గణేష్ ఈ సినిమాని నిర్మించనున్నారు. జూన్ చివరిలో లాంఛనంగా ప్రారంభించి జూలైలో సెట్స్ పైకి తీసుకెళ్ళనున్నారు.

