“పుష్ప” ఆల్బంపై అంచనాలు పెంచేస్తున్న దేవి.!

Published on Mar 5, 2021 11:00 am IST

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా తన హ్యాట్రిక్ దర్శకుడు సుకుమార్ అలాగే మ్యూజిక్ కంపోజర్ దేవిశ్రీ ప్రసాద్ తో కలిసి మొట్ట మొదటిగా పాన్ ఇండియన్ మార్కెట్ లోకి అడుగు పెడుతున్న సినిమా “పుష్ప”. ఇప్పటికే ఈ సినిమాపై ఎన్ని అంచనాలు ఉన్నాయో తెలిసిందే. అయితే మొదటి నుంచీ కూడా ఈ సినిమా ఆల్బమ్ పట్ల వేరే స్థాయి అంచనాలు ఉన్నాయి.

ఎందుకంటే ఈ ముగ్గురు కాంబో నుంచి వచ్చిన ఆర్య సిరీస్ మ్యూజిక్ ఆల్బమ్స్ ఎంత పెద్ద హిట్ అయ్యాయో చూసాము అందుకే ఈసారి “పుష్ప” ఆల్బమ్ కూడా అదిరిపోవాలని బన్నీ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. మరి అందుకు తగ్గట్టుగానే దేవీ ఇస్తున్నాడని టాక్ ఉంది. అయితే లేటెస్ట్ గా దేవీ ఇస్తున్న సాంగ్స్ కానీ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కానీ మళ్ళీ పాత దేవిని మరపిస్తున్నాయి.

ఇటీవలే నితిన్ నటించిన “రంగ్ దే” సాంగ్ ‘నీ కనులు ఎపుడు’ కు మ్యూజిక్ లవర్స్ నుంచి సూపర్బ్ రెస్పాన్స్ వస్తుంది. దీనితో ఇదే ఫ్లో కొనసాగిస్తే పుష్ప ఆల్బమ్ కూడా మోత మోగడం ఖాయం అని మళ్ళీ వింటేజ్ డిఎస్పీ ను చూస్తామని ఫ్యాన్స్ అంటున్నారు. అయితే ఈ సినిమాకు కూడా దేవి అవుట్ స్టాండింగ్ సాంగ్స్ మరియు బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చాడని తెలుస్తుంది. ఏది ఏమైనప్పటికీ మాత్రం దేవి ఇప్పుడు “పుష్ప” ఆల్బమ్ ను మరో స్థాయికి తీసుకెళ్తున్నాడు.

సంబంధిత సమాచారం :