మహేష్ అభిమానులకి భరోసా ఇచ్చిన దేవి శ్రీ !

Published on May 31, 2019 12:19 pm IST

సూపర్ స్టార్ మహేష్ బాబు 26 వ చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’ ఈరోజే లాంచ్ అయింది. ఈ సినిమాకు అనిల్ రావిపూడి దర్శకుడు కాగా దేవి శ్రీ ప్రసాద్ సంగీతం ఇవ్వనున్నారు. దేవి శ్రీ మహేష్ గత చిత్రం ‘మహర్షి’ కూడా సంగీతం ఇచ్చారు. కానీ ఆ సంగీతం అభిమానుల్ని పూర్తిస్థాయిలో అలరించలేదు. దేవి రొటీన్ మ్యూజిక్ ఇచ్చాడని, కొత్తగా ఏమీ లేదనే విమర్శలు వచ్చాయి. అలాంటిది ఈ సినిమాకి కూడా దేవి శ్రీ సంగీతం అంటే మరీ రొటీన్ అయిపోతుందేమో అనే అనుమానాల్ని కూడా వ్యక్తం చేశారు.

అభిమానుల్లో ఉన్న ఈ ఆందోళనను గుర్తించిన దేవి శ్రీ ఈరోజు చిత్ర పారంభోత్సవంలో మాట్లాడుతూ మా హీరోకి ఇప్పటి వరకు దేవి శ్రీ ఒక్క మాస్ పాట కూడా ఇవ్వలేదని అభిమానులు అంటున్నారు. మేము చేసిన గత సినిమాల్లో కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి. అందుకే ఫుల్ మాస్ సాంగ్ కుదర్లేదు. కానీ ఈ సినిమాలో అలా కాదు. సూపర్ మాస్ సాంగ్ ఒకటిస్తాను. అది ఎలా ఉంటుందంటే ఇకపై ఆ పాట లేకుండా ఏ పార్టీ జరగదు. అలాగే ఒక మంచి లవ్ సాంగ్ కూడా ఉంది. ఒక్క మాటల్లో చెప్పాలంటే ఫుల్ పార్టీ అంటూ భరోసా ఇచ్చేశారు. దేవి చెప్పిన మాటలతో కన్విన్స్ అయిన ఫ్యాన్స్ సూపర్ హిట్ ఆల్బమ్ గ్యారెంటీ అంటున్నారు.

సంబంధిత సమాచారం :

More