‘ది గ్రేట్ మాండలిన్’ – దేవిశ్రీ ప్రసాద్ గురుదక్షిణ

devi-sri
సంగీత విద్వాంసులు మాండలిన్ శ్రీనివాస్ వద్ద దేవిశ్రీ ప్రసాద్ సంగీతం నేర్చుకున్న సంగతి తెలిసిందే. సుమారు 20 సంవత్సరాల పాటు ఆయన వద్ద దేవిశ్రీ సంగీత మెళకువలు సాధన చేశారు. నేడు మాండలిన్ శ్రీనివాస్ గారి జయంతి. ఈ జయంతి సందర్భంగా దేవిశ్రీ ప్రసాద్ ఘనంగా గురుదక్షిణ ఇవ్వనున్నారు.

మాండలిన్ శ్రీనివాస్ పుట్టిన రోజు సందర్భంగా దేవిశ్రీ ఓ ప్రత్యేక గీతం రూపొందించారు. ఆయన వ్యక్తిత్వం గురించి ఈ పాట ఉంటుంది. దేవిశ్రీ సూచనలు మేరకు జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు ఈ పాటను సంస్కృతంలో రచించారు. మాండలిన్ శ్రీనివాస్ కు ఇష్టమైన కీరవాణి రాగంలో దేవిశ్రీ పాటను స్వరపరిచారు. ఈ కార్యక్రమానికి హాజరవుతున్న సంగీత ప్రముఖులు ఇళయరాజా, హరి హరన్, శంకర్ మహదేవన్, జాకీర్ హుస్సేన్ లు ఆలపిస్తారు. ఇదే దేవిశ్రీ ప్రసాద్ అర్పించే ఘనమైన నివాళి.

Exit mobile version