అల్లు అర్జున్ కి సూపర్బ్ ట్యూన్ కంపోజ్ చేసిన దేవీ

అల్లు అర్జున్ కి సూపర్బ్ ట్యూన్ కంపోజ్ చేసిన దేవీ

Published on Mar 8, 2013 10:10 AM IST

Allu-Arjun-Devisri

మ్యూజిక్ డైరెక్టర్ దేవీ శ్రీ ప్రసాద్ – స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ లది సూపర్ హిట్ కాంబినేషన్. ప్రతిసారి దేవీ శ్రీ ప్రసాద్ అల్లు అర్జున్ కి సూపర్బ్ సంగీతాన్ని అందిస్తాడు. ఇప్పుడు వీరిద్దరి కాంబినేషన్లో వస్తున్న ‘ఇద్దరమ్మాయిలతో’ సినిమాతో మరోసారి అద్బుతం సృష్టిస్తారని అందరూ అభిప్రాయపడుతున్నారు. ఈ సినిమా కోసం దేవీ శ్రీ ప్రసాద్ చక్కని మ్యూజిక్ ను అందించనున్నాడు. ఒక పాట ఈ టీంలోని ప్రతి ఒక్కరి దృష్టిని ఆకర్షించింది. ఈ సాంగ్ ని యూరప్ లో చిత్రీకరించాలనుకున్నారు. కానీ పూరి, అల్లు అర్జున్ ఈ సాంగ్ ను అందరి మనసులో నిలిచిపోయే విదంగా భారీ స్థాయిలో తెరకెక్కించలనుకుంటున్నారు, దీనికోసం భారీ సెట్టింగ్ వేసే ప్లాన్ చేస్తున్నారు. అందులో భాగంగానే ప్రొడక్షన్ టీం మార్చ్ 28న ఇండియాకు తిరిగి రానుంది. ఇక్కడ కొన్ని రోజులు షూటింగ్ జరుగనుంది. ఈసారి అల్లు అర్జున్ ఫ్యాన్స్ కోసం దేవీ శ్రీ ప్రసాద్ మ్యూజిక్ తో ఎలాంటి మ్యాజిక్ చేస్తాడో వేచి చూడాల్సిందే.

తాజా వార్తలు