‘సరిలేరు నీకెవ్వరు’.. దేవి శ్రీ అదరగొట్టేశాడట

Published on Sep 22, 2019 5:05 pm IST

మహేష్ బాబు మొదటిసారి కామెడీ జానర్ మీద ఎక్కువ దృష్టి పెట్టి చేస్తున్న చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’. అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది. ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. గతంలో మహేష్ నటించిన ‘శ్రీమంతుడు, మహర్షి, భరత్ అనే నేను’ చిత్రాలకు బ్రహ్మాండమైన సంగీతం అందించిన దేవి శ్రీ ‘సరిలేరు నీకెవ్వరు’కు కూడా అలానే ట్యూన్స్ కడుతున్నాడట.

దేవి శ్రీ సంగీతం అదరగొట్టేశాడని, పూర్తి సంతృప్తిగా ఉందని, తప్పక నచ్చుతుందని గీత రచయిత రామ జోగయ్య శాస్త్రి చెప్పుకొచ్చారు. ఇకపోతే సినిమా మొదలయ్యేటప్పుడే మంచి సంగీతం ఇస్తానని దేవి శ్రీ సభా ముఖంగా మాటిచ్చిన సంగతి తెలిసిందే. మహేష్ ఆర్మీ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్న ఈ సినిమాలో రష్మిక మందన్న కథానాయకిగా నటిస్తోంది. అనిల్ సుంకర నిర్మిస్తున్న ఈ చిత్రం వచ్చే యేడాది ప్రేక్షకుల ముందుకు రానుంది.

సంబంధిత సమాచారం :

X
More