‘డెవిల్’ : థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్

‘డెవిల్’ : థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్

Published on Dec 10, 2023 1:23 AM IST


నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా సంయుక్తా మీనన్ హీరోయిన్ గా తెరకెక్కుతున్న లేటెస్ట్ యాక్షన్ థ్రిల్లింగ్ మూవీ డెవిల్. అభిషేక్ పిక్చర్స్ బ్యానర్ పై అభిషేక్ నామా నిర్మిస్తూ దర్శకత్వం వహిస్తున్న ఈ భారీ పాన్ ఇండియన్ మూవీకి హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం అందిస్తున్నారు.

ఇటీవల మూవీ నుండి రిలీజ్ అయిన రెండు సాంగ్స్, ఫస్ట్ లుక్ టీజర్ అందరినీ ఆకట్టుకోగా డిసెంబర్ 12న థియేట్రికల్ ట్రైలర్ ని లాంచ్ చేయనున్నట్లు తాజాగా మేకర్స్ అఫీషియల్ గా ప్రకటించారు.

ది బ్రిటిష్ సీక్రెట్ ఏజెంట్ అనే ట్యాగ్ లైన్ తో వస్తున్న ఈ మూవీ పై అందరిలో మంచి అంచనాలు ఉన్నాయి. ఇక ఈ మూవీకి కథ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ ని శ్రీకాంత్ విస్సా అందించారు. ఇక ఈ మూవీని అన్ని కార్యక్రమాలు ముగించి డిసెంబర్ 29న పలు భాషల ఆడియన్స్ ముందుకి తీసుకురానున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు