దేవినేని ఆడియో విడుదల

బెజవాడలో ఇద్దరు మహా నాయకుల మధ్య స్నేహం, వైరంతో పాటు కుటుంబ నేపథ్యంలో సెంటిమెంట్‌ కలయికలో ప్రముఖ రాజకీయ నాయకుడు దేవినేని నెహ్రూ జీవిత చరిత్ర ఆధారంగా నందమూరి తారకరత్న హీరోగా వంగవీటి రాధ పాత్రలో నటుడు బెనర్జీ, వంగవీటి రంగా పాత్రలో సురేష్ కొండేటి, చలసాని వెంకటరత్నం పాత్రలో తుమ్మల ప్రసన్న కుమార్, కెఎస్ వ్యాస్ పాత్రలో ప్రముఖ సంగీత దర్శకుడు కోటి నటీ,నటులుగా నర్రా శివ నాగేశ్వరరావు (శివనాగు) ద‌ర్శ‌క‌త్వంలో జిఎస్ఆర్, రాము రాథోడ్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ‘దేవినేని’ దీనికి ”బెజవాడ సింహం” అనేది ట్యాగ్ లైన్. ఈ చిత్రం ఆడియో వేడుక శనివారం హైదరాబాద్ లోని ఫిల్మ్ ఛాంబర్ లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా వచ్చిన నిర్మాత డి.యస్ రావు “దేవినేని” ఆడియోను విడుదల చేశారు. ఈ చిత్రం లో నటించిన తుమ్మల పల్లి రామ సత్యనారాయణ, బాక్స్ ఆఫీస్ చందు రమేష్, లక్ష్మీ నివాస్, లిరిక్ రైటర్ మల్లిక్, లక్ష్మీ నరసింహ తదితరులు పాల్గొన్నారు.

చిత్ర దర్శకుడు మాట్లాడుతూ…దేవినేని సినిమా గురించి విజయవాడ నుంచి నాకు కొంతమంది నాయకులు ఈ సినిమా ఆపేయమని ఫోన్లు చేసి బెదిరిస్తున్నారు.నేను అందరికి తెలియజేసేది ఏంటంటే నేను దర్శకుడిగాకళాకారుడిగా మంచి కథ దొరికితే ప్రజలకు చేరవేయాలని తపనతోనే మేము సినిమాలు తీస్తాం తప్ప మాకు ఎవరిమీద పగలు, ప్రతీకారాలు ఉండవు. అందర్నీ మిత్రులుగా భావిస్తాం నేను దేవినేని వంగవీటి గార్ల మీద అభిమానంతోనే సినిమా తీశాను. ఈ సినిమా చేసే ముందు కూడా దేవినేని అవినాష్ గారిని కలిసి ఈ సినిమా చేస్తున్నాం అని తెలియజేయడం జరిగింది. దేవినేని అవినాష్ కూడా మేమందరం ఫ్రెండ్స్ గా ఒక ఫ్యామిలీ లాగా ఉన్నాం ఎక్కడ మాకు ఇబ్బంది లేకుండా చూడండి అని చెప్పడం తో చాలా సంతోషం వేసింది వారు చెప్పిన విదంగానే ఎవరికి ఎటువంటి ఇబ్బందులు రాకుండా ఈ సినిమా చేయడం జరిగింది. ఇందులో మేము ఎవ్వరినీ కించపరిచే విధంగా తీయలేదు. బెజవాడలో చాలామంది నా మిత్రులకు ఈ సినిమా చేస్తున్నాం అని చెబుతూనే ఉన్నాను. ఈ సినిమాలో బెజవాడ లో ఇరు కుటుంబాలు నాయకులు మంచి వారిగా ఉంటూ మహా నాయకుడిగా ఎలా ఎదిగారు. వారిద్దరిలో మంచి ఫ్రెండ్షిప్ తో పాటు రిలేషన్ కూడా ఉందని తెలియజేస్తూ… వారి దగ్గర ఉన్న అనుచరుల నుండి చిన్న చిన్న సమస్యలతో వారు ఎలా విడిపోయారు. ఏ స్నేహితులైన అలా విడిపోకుండా స్నేహంగా ఉండాలిలని తెలియజేస్తూ తీసిన సినిమానే ఈ “దేవినేని”. నేను గుంటూరు జిల్లా వాడినే నా విజయవాడ నా వాళ్లు, నేను అభిమానించే కుటుంబం పైన సినిమా చేయడం తప్ప, మిమ్మల్ని నేను ఎక్కడ కించపరిచేలా చేశాను. మీరు ఎందుకు ఈ సినిమా గురించి భయపడుతున్నారు. అవినాష్ ఎందుకు నాపై కేసులు పెడుతున్నారు. సినిమా టైటిల్ కోసం గత రెండు నెలలుగా నేను అవినాష్ వారికి ఫోన్లు చేస్తూనే ఉన్నాను అయిన వారి నుంచి ఎటువంటి స్పందన రాలేదు ఫిలింఛాంబర్లో నేను టైటిల్ రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి అడిగితే వాళ్ళ దేవినేని వారి దగ్గర లెటర్ తీసుకు వస్తేనే టైటిల్ రిజిస్ట్రేషన్ చేస్తామని అన్నారు కానీ వారెవరు సహకరించడంలేదు.

చిత్ర నిర్మాత రాము రాథోడ్ మాట్లాడుతూ..నాకు ఏదైనా ఒక మంచి సినిమా తీయాలనే డ్రీమ్ ఉండేది. విజయవాడలో తిరుగుతున్నప్పుడు దేవినేని వారి హోల్డింగ్స్ వారు చేసే మంచి పనులు నా మనసుకు బాగా దగ్గర అయ్యింది ఆ తర్వాత దేవినేని మీద ఏదో ఒక సినిమా తీయాలని తపన ఉండేది. ఇద్దరు స్నేహితులు విడిపోయినప్పుడు వారి మధ్య ఎలాంటి మాటలు వస్తాయి ఎలాంటి ఘర్షణ జరుగుతుంది అనేది ఈ చిత్రం ద్వారా తెలియజేస్తున్నాం. ఎవరు సహకరించినా సహకరించకపోయినా దేవినేని గారి బ్లెస్సింగ్స్ నాకు ఎప్పుడూ ఉంటాయని ఆశిస్తున్నాను, ఈ సినిమాను ఆదరించి సక్సెస్ చేసి మమ్మల్ని బ్లెస్స్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Exit mobile version