తమిళ హీరో కార్తి తాజా చిత్రం ‘దేవ్’ ఫిబ్రవరి 14న తమిళం తోపాటు తెలుగులోనూ విడుదలకానుంది. ఇక ఈ చిత్రం యొక్క ప్రీ రిలీజ్ ఈవెంట్ ను అన్నపూర్ణ సెవెన్ ఎకర్స్ లో ఈనెల 10న సాయత్రం 6 గంటలకు గ్రాండ్ గా జరుపనున్నారు. నూతన దర్శకుడు రజత్ రవి శంకర్ తెరకెక్కించిన ఈచిత్రంలో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటించగా రమ్యకృష్ణ ముఖ్య పాత్రలో నటించింది. కాగా కార్తీ ,రకుల్ కలిసి నటించడం ఇది రెండవ సారి. యాక్షన్ అడ్వెంచరస్ తెరకెక్కిన ఈ సినిమా కి హారిస్ జైరాజ్ సంగీతం అందించారు.
సుమారు 50కోట్ల బడ్జెట్ తో ప్రిన్స్ పిక్చర్స్ మరియు రిలయన్స్ ఎంటర్టైన్మెంట్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రాన్ని తెలుగులో ప్రముఖ నిర్మాత ఠాగూర్ మధు విడుదలచేస్తున్నారు.
