100కోట్ల క్లబ్ లో చేరిన దఢక్ !

100కోట్ల క్లబ్ లో చేరిన దఢక్ !

Published on Aug 1, 2018 1:03 PM IST

Dhadak

ప్రముఖ నటి లేడీ సూపర్ స్టార్ దివంగత శ్రీదేవి పెద్ద కుమార్తె జాన్వీ కపూర్ నటించిన మొదటి చిత్రం’ దఢక్’. మంచి అంచనాల మధ్య జూలై 20న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం పాజిటివ్ టాక్ తో బాక్సాఫిస్ వద్ద మంచి వసూళ్లను సాధిస్తుంది. ఇక ఈ చిత్రం ఇప్పటివరకు ప్రపంచ వ్యాప్తంగా రూ.100 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. జాన్వీ మొదటిచిత్రం తో నే ఈ ఫీట్ ను సాధించి బాలీవుడ్ లోకి గ్రాండ్ గా ఎంట్రీ ఇచ్చింది.

మరాఠి భాషలో విజయం సాధించిన ‘సైరాత్’ కు రీమేక్ గా తెరకెక్కిన ఈచిత్రంలో ఇషాన్ కట్టర్ హీరో గా నటించాడు. ప్రముఖ నిర్మాతలు అపూర్వ మెహతా, కరణ్ జోహార్ లు సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి శశాంక్ ఖైతాన్ దర్శకత్వం వహించాడు.

తాజా వార్తలు