ఫస్ట్ సినిమాతో ‘ధఢక్’ ఇచ్చిన శ్రీదేవి కూతురు !

Published on Jul 21, 2018 5:40 pm IST

అలనాటి అందాల నటి దివంగత శ్రీదేవి పెద్ద కుమార్తె జాన్వీ కపూర్ నటించిన మొదటి చిత్రం ‘ధఢక్’. భారీ అంచనాల మధ్య నిన్న ప్రేక్షకులముందుకు వచ్చిన ఈచిత్రం మంచి టాక్ ను సొంతం చేసుకొని విజయం దిశగా పయనిస్తుంది. రెండు వేర్వేరు కులాలకు చెందిన అమ్మాయి , అబ్బాయికి మధ్య జరిగే ప్రేమ కథ నేపథ్యంలో తెరకెక్కింది ఈ చిత్రం. ఇక బాలీవుడ్ వర్గాల సమాచారం ప్రకారం ఈచిత్రం యొక్క ఇక మొదటి రోజు వసూళ్లు అదిరిపోయే రేంజ్ లో ఉన్నాయట. రూ 9 కోట్ల కల్లెక్షన్స్ ను సాధించి బాక్సాఫిస్ వద్ద మంచి ఆరంభం తో దూసుకుపోతుంది . కొత్త వారి ని హీరో హీరోయిన్లుగా పెట్టి తీసిన ఈచిత్రానికి ఈ స్థాయిలో వసూళ్లు రావడం మాములు విషయం కాదంటున్నారు.

మరాఠి చిత్రం ‘సైరాత్’ కు రీమేక్ గా తెరకెక్కిన ఈచిత్రంలో ఇషాంత్ కట్టర్ హీరో గా నటించాడు. ప్రముఖ నిర్మాత కరణ్ జోహార్ , అపూర్వ మెహతా తో కలిసి నిర్మించిన ఈచిత్రానికి అజయ్ , అతుల్ సంగీతం అందించారు.

సంబంధిత సమాచారం :