కొత్త జర్నీ స్టార్ట్ చేస్తున్న “ధమాకా” డైరెక్టర్.!

కొత్త జర్నీ స్టార్ట్ చేస్తున్న “ధమాకా” డైరెక్టర్.!

Published on Feb 4, 2024 11:09 AM IST

మాస్ మహారాజ రవితేజ కెరీర్ లో అందుకున్న భారీ హిట్స్ లో దర్శకుడు త్రినాథరావు నక్కినతో చేసిన బిగ్ హిట్ చిత్రం “ధమాకా” కూడా ఒకటి. మరి ఈ చిత్ర దర్శకుడు త్రినాథరావు నక్కిన కెరీర్ లో డైరెక్టర్ గా అయితే సాలిడ్ ట్రాక్ రికార్డు ఉంది. అన్నీ హిట్స్ తోనే అపజయం చూడని తాను “ధమాకా” తర్వాత డైరెక్టర్ గా కొత్త ప్రాజెక్ట్ ని ఇంకా అనౌన్స్ చేయలేదు కానీ ఇంకో కీలక అనౌన్సమెంట్ ని అయితే అందించారు.

దీనితో తాను నిర్మాతగా ఇప్పుడు టర్న్ తీసుకున్నారు. నక్కిన నరేటివ్స్ అంటూ సరికొత్త ప్రొడక్షన్ బ్యానర్ ని స్టార్ట్ చేసి ఈ సంస్థ నుంచి పలు చిత్రాలు నిర్మాణం వహించనున్నట్టుగా తెలిపారు. అలాగే రానున్న రోజుల్లో మరిన్ని డీటెయిల్స్ అందిస్తున్నట్టుగా తెలిపారు. మరి దర్శకుడిగా వరుస విజయాలు డెలివర్ చేసిన తన ప్రొడక్షన్ నుంచి ఎలాంటి చిత్రాలు వస్తాయో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు