ట్రైలర్ టాక్ : హార్డ్ హిట్టింగ్ సబ్జెక్ట్‌తో వస్తున్న ‘దండోరా’

ట్రైలర్ టాక్ : హార్డ్ హిట్టింగ్ సబ్జెక్ట్‌తో వస్తున్న ‘దండోరా’

Published on Dec 19, 2025 8:10 PM IST

Dhandoraa 1

టాలీవుడ్‌లో తెరకెక్కుతున్న లేటెస్ట్ చిత్రం ‘దండోరా’ ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి బజ్ క్రియేట్ చేసింది. ఈ చిత్ర టీజర్‌కు ప్రేక్షకుల నుంచి సాలిడ్ రెస్పాన్స్ దక్కింది. శివాజీ, నవదీప్, బిందు మాధవి తదితరులు ముఖ్య పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమా పూర్తి రూరల్ నేపథ్యంలో తెరకెక్కుతుండటంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో అంచనాలు ఏర్పడ్డాయి. ఇక తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు.

ఈ ట్రైలర్ ఆద్యంతం ఆలోచింపజేసే విధంగా కట్ చేశారు మేకర్స్. పల్లెటూర్లలో కులం వివక్ష ఎలా ఉండేది అనే అంశాన్ని చాలా హార్డ్ హిట్టింగ్‌గా ఎంటర్‌టైన్‌మెంట్ జోడించి ఈ సినిమా ద్వారా చూపించబోతున్నాడు దర్శకుడు మురళీకాంత్. హత్తుకునే ఎమోషన్స్‌తో పాటు ఆలోచింపజేసే డైలాగులతో ఈ ట్రైలర్‌ను చక్కగా కట్ చేశారు. ఇలాంటి సినిమాలకు ప్రేక్షకులు తప్పకుండా పట్టం కడతారని ఈ ట్రైలర్ చూసిన పలువురు కామెంట్ చేస్తున్నారు.

ఇక ఈ సినిమాలో శివాజీ, నవదీప్, బిందు మాధవి, రవికృష్ణ, నందు తదితరులు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. వారందరూ కలిసి దండోరా చిత్రంతో ప్రేక్షకుల్లో ఆసక్తిని రేపేలా చేశారు. ఇక ఈ సినిమాను క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 25న గ్రాండ్ రిలీజ్ చేస్తున్నారు.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు