మిమ్మల్ని డైరెక్ట్ చేస్తా అని అనుకోలేదు సార్ – ధనుష్!

మిమ్మల్ని డైరెక్ట్ చేస్తా అని అనుకోలేదు సార్ – ధనుష్!

Published on Feb 23, 2024 12:46 AM IST

కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ ప్రధాన పాత్రలో నటిస్తూ, దర్శకత్వం వహిస్తున్న లేటెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ రాయన్. ఈ చిత్రం టైటిల్ అనౌన్స్ మెంట్ మరియు ఫస్ట్ లుక్ పోస్టర్ కి ఆడియెన్స్ నుండి, ఫ్యాన్స్ నుండి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రం లో సందీప్ కిషన్, కాళిదాస్ జయరామ్, ఎస్.జే. సూర్య లు కీలక పాత్రల్లో నటిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. నేడు ఈ చిత్రం నుండి మరొక ఇంట్రెస్టింగ్ అప్డేట్ ను మేకర్స్ వెల్లడించారు.

ప్రముఖ డైరెక్టర్ సెల్వ రాఘవన్ ఈ సినిమా లో కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇదే విషయాన్ని వెల్లడించడానికి సరికొత్త పోస్టర్ ను విడుదల చేసారు. అయితే మిమ్మల్ని డైరెక్ట్ చేస్తా అని అనుకోలేదు సార్ అంటూ హీరో ధనుష్ పోస్ట్ చేశారు. ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సన్ పిక్చర్స్ పతాకంపై నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఆస్కార్ అవార్డు విన్నర్ అయిన రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రం కి సంబందించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు