ధనుష్ – నాగార్జున ల మూవీ ఓవర్సీస్ రైట్స్ దక్కించుకున్న ప్రముఖ సంస్థ

ధనుష్ – నాగార్జున ల మూవీ ఓవర్సీస్ రైట్స్ దక్కించుకున్న ప్రముఖ సంస్థ

Published on Feb 13, 2024 12:34 AM IST

శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ ఎల్ పి, అమిగోస్ క్రియేషన్స్ సంస్థల పై ప్రస్తుతం నాగార్జున, ధనుష్ లతో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ఒక ప్రతిష్టాత్మక మూవీ రూపొందుతోన్న విషయం తెల్సిందే. DNS అనే వర్కింగ్ టైటిల్ తో రూపొందుతున్న ఈ మూవీ యొక్క షూటింగ్ ఇటీవల ప్రారంభం అయింది. ముందుగా ముంబైలోని ధారావి, అలానే తిరుపతిలో పలు కీలక సీన్స్ చిత్రీకరించారు.

ఈ మూవీలో నాగార్జున డాన్ గా కనిపించనున్నట్లు టాక్. విషయం ఏమిటంటే, తాజాగా ఈ మూవీ యొక్క ఓవర్సీస్ రైట్స్ ని ప్రముఖ సంస్థ డ్రీమ్జ్ ఎంటర్టైన్మెంట్ వారు భారీ ధరకు సొంతం చేసుకున్నారు. అందరిలో మంచి అంచనాలు ఏర్పరిచిన ఈ క్రేజీ ప్రాజక్ట్ ని దర్శకుడు శేఖర్ కమ్ముల అద్భుతంగా తెరకెక్కిస్తున్నట్లు చెప్తోంది యూనిట్. త్వరలో ఈ మూవీ గురించిన మరిన్ని అప్ డేట్స్ ఒక్కొక్కటిగా రానున్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు